Friday, December 20, 2024

తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోం ది. ఇదివరకే కొన్ని హామీలు అమలు చేయగా, మరికొన్ని హామీల అమలుతో పాటు పాలనలో తమదైన మార్క్ చూపించేందుకు సిఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇన్‌ఛార్జీలుగా నియమించారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అమలును సమీక్షించి, పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -కరీంనగర్, దామోదర రాజనరసింహ – మహబూబ్ నగర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి-ఖమ్మం, దుద్దిళ్ల శ్రీధర్బాబు- రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -వరంగల్, పొన్నం ప్రభాకర్‌ -హైదరాబాద్, కొండా సురేఖ -మెదక్, అనసూయ సీతక్క -ఆదిలాబాద్, తుమ్మల నాగేశ్వర రావు-నల్గొండ, జూపాల్లి కృష్ణారావు -నిజామాబాద్‌కు నియమితులయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News