Thursday, January 23, 2025

టిఎస్‌పిఎస్‌సి ఎగ్జామినేషన్ అసిస్టెంట్ కంట్రోలర్‌గా జగదీశ్వర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా ఎన్. జగదీశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఒఎస్‌డిగా ఉన్న జగదీశ్వర్‌రెడ్డి డిప్యూటేషన్‌పై రెండేళ్లపాటు టిఎస్‌పిఎస్‌సిలో కొనసాగనున్నారు. కమిషన్‌ను పటిష్ఠం చేసేందుకు చర్యలుటిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో కమిషన్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి, జవాబుదారీతనం పెంచి, నియామక ప్రక్రియను బాధ్యతాయుతంగా పూర్తి చేసేందుకు సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా ఇటీవల అదనంగా పది పోస్టులను మంజూరు చేసింది. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

దేశవ్యాప్తంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండాలని యుపిఎస్‌సి గతంలోనే సిఫార్సు చేసింది. ఈ పోస్టులో ఐఎఎస్ అధికారిని నియమించాలని, ఆయన సొంత రాష్ట్రానికి చెందినవారు కాకూడదని సూచించింది. ఈ మేరకు ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టులను సృష్టించారు. తమకు సైతం ఈ పోస్టును మంజూరు చేయాలని టిఎస్‌పిఎస్‌సి గతంలోనే ప్రభుత్వానికి విన్నవించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, అదనపు కార్యదర్శిగా ఐఎఎస్ అధికారి బిఎం సంతోషన్‌ను నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్. జగదీశ్వర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
కొత్తగా 10 పోస్టుల మంజూరు
భవిష్యత్తులో పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించే అవకాశాలు ఉండటంతో టిఎస్‌పిఎస్‌సి సైబర్ సెక్యూరిటీకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మేరకు ఐటీ ప్రొఫషనల్స్‌తో శాశ్వత పోస్టులను భర్తీ చేయనుంది. వాటిలో చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి నుంచి జూనియర్ ప్రోగ్రామర్ వరకు ఆరు పోస్టులు ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు ముగ్గురు ప్రత్యేక అధికారులు ఉంటారు. నిర్వహణ బాధ్యత పూర్తిగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్లదే. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సైతం పరీక్షల కంట్రోలర్ పరిధిలోనే ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News