Thursday, December 19, 2024

జవహార్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అడ్ హాక్ కమిటీ నియామకం

- Advertisement -
- Advertisement -

అడ్‌హాక్ కమిటీ చైర్మన్‌గా రామారావు ఎన్నిక
సభ్యులుగా శ్రీనివాస్‌రెడ్డి, హేమసుందర్,ఆచార్యులు, ఎంఏ సర్వర్ నియామకం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జవహార్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యాక్ హౌసింగ్ సొసైటీకి అడ్- హాక్ కమిటీ నియామకం జరిగింది. ఆదివారం నిజాంపేటలోని హౌసింగ్ సొసైటీ స్థలంలో జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యాక్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం హైదరాబాద్ జిల్లా సహకార శాఖ నిర్వహించింది. జిల్లా సహకార శాఖ రిజిస్టార్ రమాదేవి ఆధ్వర్యంలో సభ్యుల సమక్షంలో సొసైటీకి కమిటీని నియమించారు. ఈ అడ్‌హాక్ కమిటీ చైర్మన్‌గా ముంజేటి రామారావు సభ్యులుగా వూకంటి శ్రీనివాస్ రెడ్డి, పామరతి హేమ సుందర్, ఎస్ ఎన్ సి ఎన్ ఆచార్యులు, ఎం.ఏ. సర్వర్ ఎన్నికయ్యారు. ఎంపిక నియామక పత్రాలను వారికి అందజేశారు. అడ్ హాక్ కమిటీ జనరల్ బాడీ సమావేశం శాంతియుత వాతావరణంలో జరిగినట్లు రమాదేవి ప్రకటించారు. ఈ సందర్భంగా సహకరించిన సహకార శాఖ అధికారులకు, సమావేశానికి హాజరైన జర్నలిస్టులందరికీ అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News