- Advertisement -
న్యూఢిల్లీ: ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్(ఐఓఎ) నియమావళిని సవరించి ఎన్నికల ప్రణాళికను రూపందించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావును సుప్రీంకోర్టు గురువారం నియమించింది. దేశంలో ఒలంపిక్స్ భవిష్యత్తు కోసం ఒక నిష్పక్షపాత, అభివృద్ధితో కూడిన విధానాన్ని రూపొందించేందుకు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావును నియమిస్తున్నట్లు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ నియమావళిని సవరించేందుకు, 2022 డిసెంబర్ 15 నాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక రోడ్డు మ్యాపును రూపొందించాలని జస్టిస్ నాగేశ్వరరావును ధర్మాసనం కోరింది. ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీతో ఈ నెల 27న జరిగే సమావేశంలో పాల్గొనేందుకు ఐఓఎ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా, ఉపాధ్యక్షుడు అదిల్లె సుమరివాలాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
- Advertisement -