Tuesday, January 21, 2025

ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పెనుబల్లి రమేష్ నియామకం

- Advertisement -
- Advertisement -

దమ్మపేట: దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన న్యాయవాది పెనుబల్లి రమేష్ ఇప్పుడు తన న్యాయ సేవలో మరొక అడుగు ముందుకు వేశారు. దమ్మపేట మండలం ఏజెన్సీ ప్రాంతం లోని అంకంపాలెం గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన పెనుబల్లి రమేష్ హైకోర్టులో 8 ఏళ్లుగా న్యాయవాదిగా పని చేస్తున్నారు. న్యాయ సేవలో ఎంతోమంది గిరిజనులకు న్యాయ సలహాలు అందించడమే కాకుండా, న్యాయవాదిగా అనేక కేసుల్లో విజయం సాధించాడు. అతని క్రమశిక్షణ గుర్తించిన న్యాయశాఖ అనతి కాలంలోనే అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ నియామకం చేసింది.

చదువుతున్న రోజుల్లో నుంచే తమ ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై తన తండ్రి చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఎలాగైనా గిరిజనులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో, న్యాయవాదిగా ఎదగాలన్న తన కోరికను నెరవేర్చి ఇప్పుడు గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ గా నియమితులయ్యారు. గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్‌గా పెనుబల్లి రమేష్ నియమితులవ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News