Monday, January 20, 2025

ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. సుఖ్ బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్ లను ఎన్నికల కమిషనర్లుగా నియమించినట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి చెప్పారు. ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ పోస్టులను భర్తి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో అధీర్ రంజన్ కూడా ఒకరు. అయితే కొత్త కమిషనర్ల నియామకంపై అధికారిక ప్రకటన వెలువడకముందే ఆయన పేర్లను వెల్లడించడం గమనార్హం.

ఇటీవల ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నెల రోజుల క్రితం మరొక కమిషనర్ అనూప్ చంద్రపాండే రిటైరయ్యారు. లోక్ సభతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఖాళీ అయిన రెండు కమిషనర్ పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయవలసి రావడంతో కమిటీ గురువారం సమావేశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News