Friday, December 20, 2024

సిబిఐకి కొత్తగా ఇద్దరు అదనపు డైరెక్టర్ల నియామకం

- Advertisement -
- Advertisement -

కేంద్ర దర్యాప్తు సంస్థకు కొత్తగా ఇద్దరు అదనపు డైరెక్టర్లు నియమితులయ్యారు. ఒకే బ్యాచ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులైన ఏవైవీ కృష్ణ, ఎన్. వేణుగోపాల్‌లను నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాంమేఘాలయ క్యాడర్ 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. సీబీఐ అదనపు డైరెక్టర్ బాధ్యతల్లో ఆయన 2028 ఆగస్టు 6 వరకు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వేణుగోపాల్ ప్రస్తుతం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగుతుండగా, ఆయనకు అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. నూతన బాధ్యతల్లో ఆయన 2027 మే 24 వరకు కొనసాగనున్నట్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News