Monday, December 23, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్‌మెన్ల నియామకాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో విద్యార్థులకు తగిన వసతులు కల్పించాలనే లక్ష్యంతో గతేడాది నుంచి మన బస్తీ, మన ఊరు కార్యక్రమం ద్వారా బడులకు కొత్త రూపం తీసుకొస్తుంది. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో పూర్తి కాగా, మరికొన్ని స్కూళ్లలో పనులు కొనసాగిస్తున్నారు. పనులు త్వరగా జరిపేందుకు విద్యాశాఖ 1982 వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

త్వరలో అర్హులైన వారి నియమించాలని జిల్లా అధికారులకు సూచించారు. నియమితులైన వారికి నెలకు రూ. 5వేలు వేతనం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాల్లో 535, యుపిఎస్ స్కూళ్లులో 93, ఉన్నత పాఠశాల్లో 1354 పోస్టులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News