- Advertisement -
వీసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్యా శాఖ కమిషనర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వర్సిటీలో ఇటీవల వీసీలు చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశించారు. వీసీ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన తెలంగాణ వర్సిటీ ఈసీ సమావేశంలో వీసీ తీరుపై సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈసీ సభ్యుల పట్ల వీసీ తీరు సరిగ్గా లేదని వారు నవీన్మిత్తల్కు ఫిర్యాదు చేశారు. ఈసీ సభ్యులకు వీసీ ఆలస్యంగా అజెండా ఇవ్వడంపై మిత్తల్ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వర్సిటీ ఈసీ సమావేశాన్ని ఈనెల 30కు వాయిదా వేయడంతో ఆ రోజు జరిగే సమావేశంలో తాను కూడా పాల్గొంటానని, పూర్తిస్థాయిలో సమస్యలను చరిస్తామని మిత్తల్ ఈసీ సభ్యులతో స్పష్టం చేశారు.
- Advertisement -