సుప్రీం ఆగ్రహంతో దిగివచ్చిన సర్కార్
న్యూఢిల్లీ: ఇన్‌కంటాక్స్ అప్పెలేట్ ట్రిబ్యునల్ సహా 12 ట్రిబ్యునల్స్‌లో నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం గురువారం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెలెక్షన్ కమిటీ సిఫార్సు చేసిన జాబితాను పక్కన పెట్టి కొందరినే ఏరికోరి నియమించడంపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర అసంతృస్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం గమనార్హం. రెండు వారాల్లో ట్రిబ్యునల్స్‌లో నియామకాలకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్లతో రావాలని, లేదంటే ఎందుకు నియమించలేదో కారణాలను తెలపాలంటూ స్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాదు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, చట్టాలను పాటించాలంటూ తీవ్ర స్థాయిలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది కూడా. ఫలితంగా కేంద్రం గురువారం 12 ట్రిబ్యునల్స్‌లో నియామకాల నిబంధనలకు సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది.