Thursday, January 23, 2025

‘మల్లన్న సాగర్’ మహాద్భుతం

- Advertisement -
- Advertisement -

అపర భగీరథుడు కెసిఆర్

కరువును తరిమికొట్టిన
దార్శనికుడు అన్నదాతకు
ఆయన ఆప్తుడు కెసిఆర్
నాయకత్వం దేశానికి
అవసరం తెలంగాణ
పథకాలు మా రాష్ట్రాల్లోనూ
అమలు చేయాలి
25 రాష్ట్రాలకు చెందిన
రైతు ప్రతినిధుల ప్రశంసలు
మల్లన్న సాగర్‌ను
సందర్శించిన రైతు నేతలు
అభివృద్ధిని కళ్లారా
చూద్దామని వచ్చామన్న
రైతు సంఘాల నాయకులు

మన తెలంగాణ/తొగుట: మల్లన్న సాగర్ ప్రాజె క్టు బాగుందని జాతీయ రైతు సంఘాల నాయకులు ప్రశంసించారు. దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 75 మంది రైతు ప్రతినిధులు ఎంఎల్‌సి, రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. మొదట సాగర్ పంప్‌హౌస్‌ను సందర్శించిన రైతు నాయకులు ప్రాజెక్ట్ నిర్మాణ తీరుకు అచ్చెరువొందారు. వారికి నీటి పారుదల శాఖ ఇన్‌జినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సి) హరేరామ్ తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మాగానిని సేద్యంలోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్వప్నసాకారం కాళేశ్వరం ప్రా జెక్టు మొదలు నుంచి అనకట్టలు, బ్యారేజ్‌లు, రి జర్వాయర్లు, కాలువల నిర్మాణం తదితర అంశాలను రైతు ప్రతినిధి బృందానికి సవివరంగా మ్యా ప్‌లు రూపంలో వివరించారు. కాగా, పంప్‌హౌస్‌ను నిర్మాణం తీరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 100 మీటర్ల లోతులో కాళేశ్వరం వంటి ఇంత పెద్ద పంప్‌హౌస్ నిర్మించడం, సాంకేతిక నైపుణ్యాన్ని ఒడిసిపట్టి నీటిని అపర భగీరథుడి మాదిరిగా జనం మధ్యకు తీసుకురావడం చరిత్ర లో మరో పాఠమేనని వారు పేర్కొన్నారు.

నీళ్లు లేనిచోటకు 200 కిలోమీటర్ల నుంచి నీళ్లు తీసుకువచ్చి, కరువును దూరం చేసిన సిఎం కెసిఆర్‌ను వారంతా వేనోళ్ల పొగడ్తలతో ముంచెత్తారు. పంజాబ్ తదితర రాష్ట్రాల్లో రైతు కుటుంబాలకు సిఎం కెసిఆర్ తలా రూ.3 లక్షల చొప్పున పరిహా రం చెల్లించడం పట్ల రైతు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సిఎం కెసిఆర్ తరహాలో తమ రాష్ట్రాల్లో ప థకాలు అమలు చేయాలని, కెసిఆర్ నాయక త్వం దేశానికి అవసరమని వారు ఈ సందర్భం గా నొక్కి చెప్పారు. అనంతరం మల్లన్న సాగర్ డెలివరీ చానల్‌ను సందర్శించి ప్రాజెక్టులో నీళ్ళు చూసి సంతోషం వ్యక్తం చేశారు. నీళ్లు లేని చోట ప్రాజెక్టు నిర్మించి నీటిని నిలువ చేసి, పంట పొలాలకు తరలించడం మహాద్భుతమన్నారు. ప్రాజెక్టు తీరుతెన్నులను రైతులు సెల్ఫీలలో తీయడానికి పోటీలు పడ్డారు. కాగా, పంప్‌ను ప్రారంభించడంతో ఎయిర్ బాగా రావడంతో ఒక్కసారిగా నీళ్ళు కట్టమీద ఉన్న వారి మీద పడటంతో పలువురు కింద పడిపోయారు. రైతు నాయకుల వెంట ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హరితహారం దేశానికే ఆదర్శం

* తెలంగాణ విధానాలు, పథకాలు అనుసరణీయం

రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో 33శాతం పచ్చదనం సాధించేందుకు ఎనిమిదేళ్లలో 267 కోట్ల మొక్కలు నాటామని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, పిసిసిఎఫ్ డోబ్రియాల్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ పథకాల అమలుతీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రైతులు శుక్రవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణకు హరితహారం పథకం ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక అని భూపాల్ రెడ్డి రైతు నాయకులకు వివరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా, కేవలం ఎనిమిదేళ్లలో అన్నిరంగాల్లో ముందంజలో ఉందన్న విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర పర్యటనకు వచ్చామని ప్రతినిధులు తెలిపారు.

తమ పర్యటనలో భాగంగా తెలంగాణకు హరితహారం అమలుతీరును తెలుసుకున్న రైతు సంఘాల నేతలు, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజీవ్ రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), ఔటర్ రింగ్‌రోడ్డుపై పచ్చదనం, సిద్దిపేట జిల్లా ములుగు, సింగాయపల్లి, కోమటిబండ ప్రాంతాల్లో క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్ధరించటం ద్వారా కొన్నేళ్లలోనే చిక్కటి అడవిలా మార్చిన విధానాన్ని వారు పరిశీలించారు. కొన్నేళ్ల కిందట పూర్తిగా చెట్లు లేకుండా బోసిపోయిన ప్రాంతం పునరుద్ధరణ ద్వారా ప్రకృతి, పర్యావరణహితంగా మారిన విధానాన్ని నాడు, -నేడు ఫోటోలు, ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పట్టణ ప్రాంతాలకు సమీప అటవీ ప్రాంతాల్లో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 7.7 శాతం పచ్చదనం రాష్ట్రవ్యాప్తంగా పెరిగిందని పిసిసిఎఫ్ డోబ్రియాల్ వివరించారు.

ఉద్యమంలా తెలంగాణకు హరితహారం అమలు చేస్తున్న తీరు అద్భుతంగా ఉందని, ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసిన తీరు, ఎక్కడ చూసినా పెరిగిన పచ్చదనం కళ్లెదుట కనిపిస్తోందని రైతు నేతలు ప్రశంసించారు. ఇక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలని రైతు బృందం నేతలు అభిప్రాయపడ్డారు. అటవీ శాఖ అధికారులు తమ రాష్ట్రాల్లో పర్యటించి, పచ్చదనం పెంపు విధానాలను వివరించాలని వారు ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News