- Advertisement -
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) పథకం కింద అర్బన్ ఏరియాల్లో 1.68 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంతవరకు మొత్తం 1.1 కోట్ల ఇళ్లకు మంజూరు లభించిందని ప్రభుత్వం గురువారం ప్రకటనలో పేర్కొంది. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులతో సెంట్రల్ శాంక్షనింగ్‌అండ్ మోనిటరింగ్ కమిటీ (సిఎస్‌ఎంసి) బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. పిఎంఎవైయు కింద 41 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందని, మరో 70 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. అయితే సిఎస్‌ఎంసి సమావేశంలో కొత్తగా 1,68,606 ఇళ్లు నిర్మించడానికి ఆమోదం లభించింది.
- Advertisement -