Thursday, January 23, 2025

దసరా నాటికి హెల్త్‌సిటీ

- Advertisement -
- Advertisement -

మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. దసరా నాటికి ప నులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పా రు. గ్రేటర్ పరిధితో పాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చే రువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్, ఎల్‌బి నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల పనులు పురోగతి, ఇతర అంశాలపై మంత్రి హరీశ్ రావు ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూప్రజలకు నాణ్యమైన వైద్యం అందిం చే దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో విప్లవాత్మమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇం దులో భాగంగా ఒక వైపు వైద్యం, మరోవైపు వైద్య విద్యను విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు.

వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే మెడికల్ హబ్‌గా మారుతుందని మంత్రి అన్నారు. ఇందు లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చుతున్నట్లు చెప్పారు. అత్యాధునిక మాడ్యులర్ థియేటర్లు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశమే లేకుండా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవ లు ఉండాలన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం అని మంత్రి స్పష్టం చేశారు. అన్నారు. ఒక్కొక్కటి 1000 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృ షి చేయాలన్నారు. 8 టీచింగ్ ఆసుపత్రుల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభం కానున్న 9 మెడికల్ కాలేజీ ల డిజైన్లు రూపొందించాలని చెప్పారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ తరుపున అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. కాబట్టి ఆర్ అండ్ బి అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు.
ఇహెచ్‌ఎస్‌పై పది రోజుల్లో నివేదిక
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్యాష్ లెస్ వైద్య సేవలపైన (ఇహెచ్‌ఎస్) ఉద్యోగులు, టీచర్ల సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించి, పది రోజుల్లో నివేదిక రూపొందించాలని హరీశ్‌రావు తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు కొత్త ఇహెచ్‌ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకువస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు ఆరోగ్య శ్రీ సిఇఒ విశాలాచ్ఛిని ఆదేశించారు. ఇదే సమయంలో ఆరోగ్య శ్రీ సేవలు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా కృషి చేయాలన్నారు. పేషెంట్లకు అందుతున్న సేవల పట్ల స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని చెప్పారు. వారానికి మూడు ఆసుపత్రులు సందర్శించాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పేషెంట్లకు అందుతున్న ఆరోగ్య శ్రీ సేవలను తెలుసుకోవాలని తెలిపారు.
మెడికల్ కాలేజీల అనుమతుల పట్ల మంత్రి అభినందనలు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య తెలంగాణ కల సాకారం దిశగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ఏడాది ప్రారంభించుకునే 9 మెడికల్ కాలేజీలకు గాను 6 మెడికల్ కాలేజీలకు అనుమతులు రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మిగతా మూడు మెడికల్ కాలేజీల అనుమతులు తుది దశలో ఉన్నట్లు డిఎంఇ రమేష్ రెడ్డి మంత్రికి వివరించారు. ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ, అనుమతుల కోసం ఎలాంటి సమాచారం అడిగినా వెంటనే అందిస్తూ ఉండాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డిఎంఈ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస రావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, సిఎం ఒఎస్‌డి గంగాధర్, అరోగ్య శ్రీ సిఇఒ విషాలాచ్చి, ఆర్ అండ్ బీ ఇ ఎన్ సి గణపతి రెడ్డి, టిఎస్ ఎంఎస్‌ఐడిసి సీఇ రాజేందర్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News