- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని స్పష్టీకరించిన బిల్లును లోక్సభ సోమవారం ఆమోదించింది. కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీ ఇది రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్రెడ్డి ఈ సవరణ బిల్లు ఆవశ్యకతను వివరించారు. ఢిల్లీ ప్రభుత్వ పాలనకు సంబంధించి కొన్ని అంశాల్లో అయోమయం నెలకొంటోందని, దీనిపై అనేక కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని వివరించారు.
- Advertisement -