Monday, January 20, 2025

గ్రూప్-1 దరఖాస్తుల గడువు పొడిగింపు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీపీఎస్సీ గడువును పొడిగించింది. దీంతో గ్రూప్-1కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఊరట లభించింది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు గడువు ఈ నెల 21వ తేదీనే ముగిసింది. అంతకుముందు నుంచి అభర్థులు.. దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని ఏపీపీఎస్సీని కోరారు. ఈ క్రమంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు తేదీని పడిగించేందుకు నిర్ణయం తీసుకుంది.

జనవరి 28వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. తర్వాత మళ్లీ దరఖాస్తు గడువు పొడించమని.. అర్హులైన అభ్యర్థులందరూ ఈనెల 28వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని తెలిపింది. కాగా, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు మార్చి 17న నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News