Sunday, January 19, 2025

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దు

- Advertisement -
- Advertisement -

ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ కొందరు విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. పరీక్ష పత్రాలను మాన్యువల్ పద్ధతిలో రెండుసార్లు దిద్దారని, మొదటిసారి దిద్దిన ఫలితాలను ఆపేసి, రెండోసారి మళ్లీ దిద్దించి, తమకు కావలసినవారిని ఎంపిక చేసుకున్నారని వారు తమ పిటిషన్ లో ఆరోపించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇలా రెండుసార్లు దిద్దడం చట్టవిరుద్ధమని పేర్కొంది. పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన హైకోర్టు.. ఆరువారాల్లోగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News