Monday, January 20, 2025

‘ఏప్రిల్ ఫూల్స్ డే’ ఎలా మొదలైందో తెలుసా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అనేక దేశాలలో ఏప్రిల్ 1వ తేదీన ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ జరుపుకుంటుంటారు. వాస్తవానికి ఆ రోజున ప్రాక్టికల్ జోకులు వేసుకొంటుండడంతో ఇది రివాజుగా మారింది. నిజానికి అది ఎలా పుట్టిందన్నది, ఎప్పుడు పుట్టిందన్నది ఎవరికీ తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకుంటున్నారు. ఇది పూర్వం ప్రాచీన రోమ్ లో మార్చి 25న జరుపుకునే ‘హిలారియా’ వేడుకను పోలి ఉంటుంది. ఈ రోజున, ప్రజలు ఒకరినొకరు మోసం చేయడానికి, తప్పుడు సమాచారం ఇవ్వడానికి, హాస్యభరితమైన ప్లాన్‌లు వేయడానికి ఇష్టపడతారు. అయితే, మోసం హానికరం కాకుండా, ఆనందాన్నిచ్చేలా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఏ కారణం ఏమైనప్పటికీ, ఏప్రిల్ ఫూల్స్ డే ప్రపంచవ్యాప్తంగా ఒక ఆహ్లాదకరమైన వేడుకగా జరుపుకుంటారు.

ఐరోపాలో ఏప్రిల్ 1వ తేదీన కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది.  1582లో, పోప్ గ్రెగరీ XIII ఈ వ్యవస్థను మార్చి, జనవరి 1వ తేదీని కొత్త సంవత్సర ప్రారంభంగా నిర్ణయించారు. కానీ కొంతమంది ఈ మార్పును అంగీకరించలేదు, ఏప్రిల్ 1వ తేదీనే కొత్త సంవత్సరం జరుపుకుంటూ వచ్చారు. ఈ వ్యక్తులను “ఏప్రిల్ ఫూల్స్” అని ఎగతాళి చేసేవారు.

ఏప్రిల్ 1వ తేదీన ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతాయి. పక్షులు గూళ్ళు కట్టడం మొదలుపెడతాయి, చెట్లు చిగురిస్తాయి. ఈ మార్పులను చూసి ప్రజలు ఒకరినొకరు మోసం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం ఒక ఆటగా భావించేవారు.

1381లో ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ II, బొహేమియా రాణి అన్నేతో మార్చి 32న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ తేదీ అసలు లేదు. ఈ వార్తను నమ్మిన ప్రజలను “ఏప్రిల్ ఫూల్స్” అని పిలిచేవారు.

ఫ్రెంచ్ భాషలో “poisson d’avril” అంటే “ఏప్రిల్ చేప” అని అర్థం. “Poisson” అనే పదానికి “fool” అని కూడా అర్థం ఉంది. కాలక్రమేణా, ఈ పదబంధం “April Fool’s Day” గా మారి ఉండవచ్చని భావిస్తారు.

అమెరికాలో ఏప్రిల్ ఫూల్స్ డే నాడు ‘ప్రాంక్స్’, ‘ప్రాక్టికల్ జోక్స్’ వేసుకోవడం పరిపాటి, దీని వల్ల ఇతరులను నవిస్తూ, ఉడికెత్తిసూత సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేసుకోవడం దీని వెనుక ఉన్న కారణం. స్కూల్స్, కాలేజీలలో ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకోవడం సామాన్యం. ఏదైనా శృతి మించకపోతే ఆమోదయోగ్యమే.

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News