Monday, December 23, 2024

అప్సర హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి… కార్తీక్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అప్సర హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరకు గతంలో వివాహమైనట్లు ఫోటోలు వైరల్‌గా మారాయి. అప్సరను కార్తీక్ రాజా అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్సరను పెళ్లి చేసుకున్న తరువాత కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్సర హత్య తరువాత కార్తీక్ తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల చేసింది. కార్తీక్ ఆత్మహత్యకు అప్సర, ఆమె తల్లి కారణమని ధనలక్ష్మి ఆరోపణలు చేసింది.

తన కుమారుడిని మానసికంగా వేధించారని కార్తీక్ తల్లి వాపోయింది. లగ్జరీల కోసం టూర్లకు తీసుకెళ్లాలని అప్సర వేధించేదని, గొడవలు పడి తన కుమారుడిని జైళ్లో కూడా పెట్టించారని దుయ్యబట్టారు. అవమానంతోనే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తల్లి ధనలక్ష్మీ తెలిపింది. అప్పటి నుంచి అప్సర, ఆమె తల్లి కనిపించలేదని, అప్సరకు సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువగా ఉండేదని వివరించింది. అప్సరను ఆమె ప్రియుడు పూజారి సాయి కృష్ణ హత్య చేసిన విషయం తెలిసిందే. అప్పర హత్య కేసులో నిందితుడిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఉప్పరపల్లి కోర్టులో ఆర్‌జిఐ పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు.

Also Read: రోహిత్‌శర్మపై ఆగ్రహజ్వాలలు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News