Monday, December 23, 2024

హత్యకు 15 రోజుల ముందే 20 అడుగుల గొయ్యి

- Advertisement -
- Advertisement -
మళ్లీ ప్లాన్ ఛేంజ్.. అప్సర కేసులో వెలుగులోకి కీలక విషయాలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అప్సర కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పూజారి సాయికృష్ణకు పోలీసుల కస్టడీ ముగియనుండటంతో.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. కాగా ఈ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. పూజారి సాయికృష్ణ తన ప్రియురాలు అప్సరను శంషాబాద్‌లో చంపి, తన కారులో తీసుకొచ్చి మ్యాన్ హోల్‌లో పూడ్చేశాడు. ఈ కేసులో సాయికృష్ణను పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. కాగా సాయికృష్ణ కస్టడీ శనివారం ముగియ నుండటంతో శుక్రవారం శంషాబాద్ మండలం సుల్తాన్‌పూర్ వద్ద అప్సరను హత్య చేసిన ప్రదేశానికి, అక్కడి నుంచి పాతిపెట్టిన స్థలానికి సాయికృష్ణను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేశారు. ఆ స్థలాల్లో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం.

నిందితుడు సాయికృష్ణ అప్సరను హత్య చేయడానికి 15 రోజుల ముందే పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. హత్య ఎలా చేయాలి..? శవాన్ని ఎక్కడ పూడ్చేయాలి..? సాక్ష్యాధారాలు దొరకకుండా ఏం చేయాలి..? లాంటి విషయాలపై పక్షం రోజుల ముందే పక్కాగా ఓ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. సాయికృష్ణ పూజారిగా చేస్తున్న బంగారు మైసమ్మ గుడి వెనక ఉన్న ఆసుపత్రి వద్ద ఏకంగా 20 అడుగుల గుంత తీయించాడు. అయితే అది గమనించిన ఆసుపత్రి సిబ్బంది సాయికృష్ణను వారించడంతో వెంటనే గుంతను పూడ్చివేయించాడు. అనంతరం ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసి అనుకున్న విధంగానే అప్సరను ట్రాప్ చేసి హత్య చేశాడు.

ప్లాన్‌లో చేసిన ఛేంజ్ ప్రకారం డ్రైనేజీ మ్యాన్ హోల్ వద్ద స్థలం ఉండటంతో అక్కడే అప్సర మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అనంతరం.. ఎవ్వరికీ అనుమానం రాకుండా సాక్ష్యాలు దొరకుండా ఉండేందుకు మ్యాన్‌హోల్ వద్ద రెండు లోడ్‌ల మట్టి పోయించాడు. అక్కడితో ఆగకుండా దానిపై కాంక్రీట్ వేసి పూర్తిగా మూయించేశాడు. నిందితుడు సాయికృష్ణ టిప్పర్ ద్వారా మ్యాన్ హోల్‌పై మట్టి పోయించగా ఆ టిప్పర్ యజమానిని, కూలీని పిలిచి పోలీసులు వారి నుంచి స్పాట్‌లో స్టేట్ మెంట్ నమోదు చేశారు. పూజారి సాయికృష్ణ చేసిన ఈ హత్య కేసులో బయటపడుతున్న ఒక్కో ట్విస్ట్.. క్రైమ్ మూవీని మించి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పేర్కొన్నారు.

మరోవైపు అప్సరకు ఇంతకు ముందే పెళ్లైందని భర్తతో కలిసి ఉన్న ఫొటోలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఫొటోల్లో ఉన్న కార్తీక్ రాజా అనే వ్యక్తి తల్లి ధనలక్ష్మి ఓ ఆడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. తన కొడుకు కార్తీక్ రాజు ఆత్మహత్యకు అప్సర, ఆమె తల్లి వేధింపులే కారణం అంటూ ఆమె చెప్పడం ఇప్పుడు కేసులో మరో ట్విస్ట్ తెరలేపింది. వివరాల్లోకి వెడితే చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత డబ్బుల కోసం, టూర్లకు వెళ్లాలంటూ అప్సర తన కొడుకును వేధించేదని లగ్జరీ లైఫ్ కోసం అతడిని హింసించేదని కార్తీక్ తల్లి ధనలక్ష్మి తెలిపింది. అప్సర, ఆమె తల్లి అరుణల వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆడియోలో పేర్కొంది.

కార్తీక్ రాజా మీద ఒకసారి అప్సర పోలీస్ కేసు కూడా పెట్టిందని, దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని తెలిపింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ఆమె తన ఆడియోలో తెలిపింది. ఆ తరువాతి నుంచి అప్సర, ఆమె తల్లి అరుణ కనిపించలేదన్నారు. దీంతో ఇప్పుడు అప్సరకు అంతకుముందే పెళ్లయిందా?.. ఈ విషయం అప్సర ఇంట్లో తెలుసా..? ధనలక్ష్మి చేస్తున్న ఆరోపణలు నిజమేనా? ఫోటోల్లో అప్సరతో పాటు ఉన్నది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే సాయికృష్ణ తండ్రి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గత మూడు నెలలుగా తన కొడుకును అప్సర తీవ్రంగా వేధిస్తోందని టార్చర్ భరించలేకపోతున్నానని కొడుకు అన్నాడని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ శంషాబాద్ లో కలకలం సృష్టించిన అప్సర హత్య కేసులో మరో విషయం వెలుగు చూసింది. అప్సర తల్లి మాట్లాడుతూ… ‘అప్సర మూడో తేదీ కోయంబత్తూర్ వెడతానని చెప్పి వెళ్లింది. బస్సులో వెడుతున్నానని చెప్పింది. తరువాత ఫోన్ కలవలేదు. దీంతో స్నేహితుడైన సాయికృష్ణకు పదే పదే ఫోన్లు చేసినా ఎత్తలేదు. ఆ తరువాత ఆదివారం సాయికృష్ణ మా ఇంటికి వచ్చాడు. అప్సర స్నేహితులతో భద్రాచలం వెడతానంటే తానే భద్రాచలం పంపించానని చెప్పాడు. నువ్వెలా పంపిస్తావు, నీకేం అధికారం ఉందని, సిసిటివి ఫుటేజ్ చెక్ చేద్దాం పదా అన్నా దానికి సమాధానం దాట వేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News