Monday, January 20, 2025

గూగుల్‌లో చూసి అప్సర హత్య

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: యువతిని పూజారి హత్య చేసిన కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. సరూర్‌నగర్‌కు చెందిన అప్సరను అదే కాలనీలో ఉంటున్న పూజారి ఈ నెల 3వ తేదీన హత్య చేసిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటూ సీరియల్స్‌లో నటించేందుకు ట్రై చేస్తున్న అప్సరకు పూజారీ సాయికృష్ణ పరిచయమ్యాడు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏడాది నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఉందని పేర్కొన్నారు.

సాయికృష్ణ సరూర్‌నగర్‌లోని మైసమ్మ గూడిలో పెద్దపూజారిగా పనిచేస్తున్నాడు. అక్కడికి అప్సర తరచూ వచ్చేది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి గత ఏడాది నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారకను సందర్శించారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్‌లో సాయికృష్ణకు అప్సర ప్రపోజ్ చేసింది. దానికి సాయికృష్ణ అంగీకరించడంతో తరచూ ఇద్దరు శంషాబాద్‌లోని గోశాలకు కారులో కలిసి వెళ్లేవారు.

ఈ క్రమంలోనే మార్చి నుంచి తనను వివాహం చేసుకోవాలని అప్సర, సాయికృష్ణపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. రాను రాను ఆమె బెదిరింపులు ఎక్కువై తనను వివాహం చేసుకోకుండా రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. దీంతో అప్సర బతికి ఉంటే తనకు ఇబ్బందని, అడ్డుతొలగించుకోవాలని సాయికృష్ణ ప్లాన్ వేశాడు.
గూగుల్‌లో సెర్చింగ్….
అప్సరను హత్య చేయాలని ప్లాన్ వేసిన సాయికృష్ణ ఎలా హత్య చేయాలో గూగుల్‌లో సెర్చ్ చేశాడు. అందులో చూసి దాని ఆధారంగా హత్య చేశాడు. దీనితోడు తరచూ అప్సర తనను కోయంబత్తూరుకు తీసుకుని వెళ్లాలని సాయికృష్ణను కోరుతున్నది. దీనిని అడ్డుగా పెట్టుకుని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. కోయంబత్తూరుకు తీసుకుని వెళ్తానని, టికెట్ బుక్ చేశానని చెప్పి ఈ నెల 3వ తేదీన అప్సరను తీసుకుని కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలు దేరాడు. శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకున్నాక ఫ్లైట్ టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు.

తర్వాత గోషాలకు వెళ్దామని చెప్పి రాళ్లగూడ వైపు తీసుకుని వెళ్లాడు. మధ్యలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ డిన్నర్ చేశారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో సుల్తాన్‌పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు. ముందు సీటులో కూర్చుని నిద్రపోతున్న అప్సరను సాయికృష్ణ వెంచర్‌వైపు తీసుకుని వెళ్లి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా హత్యకు గురైన అప్సర మృతదేహానికి ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు అప్సర కుటుంబ సభ్యులకు అప్పగించారు. సరూర్‌నగర్‌లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
మేము శారీరకంగా కలవలేదు…
తాను అప్సరను శారీరకంగా ఎప్పుడు కలవలేదని సాయికృష్ణ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. చెన్నైకు చెందిన బాయ్‌ఫ్రెండ్‌తో అప్సరకు సంబంధం ఉందని చెప్పినట్లు తెలిసింది. జనవరిలో గర్భం దాల్చినట్లు తనకు అప్సర చెప్పిట్లు సాయికృష్ణ చెప్పాడు. తాను మూడు నెలల గర్భవతినని జనవరిలోనే అప్సర చెప్పిందని సాయికృష్ణ వెల్లడించాడు.

గర్భానికి తాను కారణమని వి వాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిందని, అప్సరకు వేరే వారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇవన్నీ భరించలేకే హత్య చేసినట్లు వెల్లడించారు.
నేను బతకను…టార్చర్ చేసింది…
అప్సర హత్య కేసులో అరెస్టయిన పూజారి సాయికృష్ణ శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో హంగామా చేసినట్లు తెలిసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానని, జైలుకు పంపించినా కూడా బతకనని బోరున విలపించినట్లు తెలిసింది. తనకు అప్సరను చంపే ఉద్దేశం లేదని, వివాహం చేసుకోవాలని తనను టార్చర్ చేసిందని చెప్పినట్లు తెలిసింది. కొద్ది రోజుల నుంచి రోజు తనను వివాహం చేసుకోవాలని లేకుంటా తమ పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తానని బెదిరించిందని తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News