Sunday, December 22, 2024

కృష్ణా జిల్లాలో బస్సు దగ్ధం.. ప్రయాణికులు సేఫ్

- Advertisement -
- Advertisement -

APSRTC Bus fire in Krishna district

పెదపారుపూడి: కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. బస్సు గుడివాడ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు, సహా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజన్ నుంచి మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేశాడు. ప్రయాణికులంతా హడావుడిగా కిందకు దిగడంతో పెనుప్రమాదం తప్పింది. కానీ, ప్రాణాలను కాపాడుకోవాలనే తొందరలో చాలా మంది ప్రయాణికులు తమ బ్యాగులను బస్సులోనే వదిలేశారు. బస్తాలన్నీ బూడిదయ్యాయి. తమ బ్యాగుల్లోని నగదు, బంగారం, బట్టలు, ఇతర వస్తువులు ధ్వంసమైనట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు బస్సును తనిఖీ చేసి కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News