Monday, April 7, 2025

ఎంపి వద్దిరాజుకు ఆప్టా ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: అట్లాంటాలో జరిగే సదస్సుకు హాజరు కావలసిందిగా రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్రకు ఆహ్వానం అందిందింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వరకు జరిగే 15వ సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరు కావలసిందిగా కోరుతూ ఆప్టా మాజీ అధ్యక్షులు గోపాలా శనివారం హైద్రాబాద్ లో వద్దిరాజును కలిసి ఆహ్వానించారు.ఆప్టా అధ్యక్షులు కొట్టే ఉదయభాస్కర్ తరఫున మాజీ అధ్యక్షులు గుడపాటి గోపాలా స్వయంగా ఆహ్వానించారు.

వద్దిరాజుతోపాటు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్ లను కూడా ఆహ్వానించారు. ప్రముఖ వ్యాపారవేత్త మరికల్ పోత సుధీర్ కుమార్,డాక్టర్ సెట్లం రంగయ్యలతో కలిసి మంత్రి,ఎంపీల నివాసాలకు వెళ్లి ఆహ్వానించారు.అట్లాంటాలోని సౌత్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సదస్సుకు అమెరికాలో స్థిరపడిన వేలాది తెలుగు కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధు లు,వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని గోపాలా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News