Monday, January 6, 2025

శనిగరం ప్రాజెక్టుకు జలకళ

- Advertisement -
- Advertisement -

జలపాతాన్ని తలపిస్తున్న మత్తడి

పెరిగిన పర్యాటకుల తాకిడి

సెల్ఫీ ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు

కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం మధ్యతరహ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండుకుండలా మారింది. వరుసగా కురిసిన వర్షాలకు మండలంలోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 1టిఎంసి నిండు కుండలా మరి, గురువారం మత్తడి దూకుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా కోహెడ, బెజ్జంకి మండలాలకు చెందిన తొమ్మిది గ్రామాల పరిధిలో దాదాపు 5100 ఎకరాలకు సాగు నీరుకు డోకా లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం పర్యాటకులతో శనిగరం ప్రాజెక్టు కనువిందు చేస్తుంది. శనిగరం ప్రాజెక్టు మత్తడి దుంకుతుడడంతో కొత్త అందాన్ని సంతరించుకుంది. పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ.. వీడియోలు చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ తెగసంబర పడిపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News