Wednesday, January 22, 2025

కాళేశ్వరంతో తెలంగాణలో జలకళ

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి రూరల్: కాళేశ్వరంతో తెలంగాణలో జలకళ సంతరించుకుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలంలోని పంబాపూర్ గ్రామంలోని భీమ్ గణపురం చెరువు కట్టపై ఏర్పాటు చేసిన సాగునీటి దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
కోలాటాలు, నృత్యాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పంబాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 1,13,807 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించబడుతుందన్నారు.

ఈ నియోజకవర్గం పరిధిలో 07 మండలాలను కలిగి ఉంది, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, రేగొండ, మొగుళ్ళపల్లి, ములుగు, గణపురం, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల క్రింద 48,192 ఎకరాల ఆయకట్టు, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టుల క్రింద ఆయకట్టు ఏమి లేదు. చిన్న నీటి పారుదల క్రింద 55,16100 ఎకరాల ఆయకట్టు కలదని, ఐడిసి క్రింద 10,454 ఎకరాల ఆయకట్టు కలదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2017లో నీటిని ఎత్తిపోసేందుకు ఫేజ్3 క్రింద భీంఘన్‌పూర్ పంప్ హౌజ్, ప్రెజర్ మెయిన్స్ నిర్మించి, మూడవ దశ రెండు ప్యాకేజి క్రింద రూ. 1325కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2020లో రామప్పకు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారని, 2014 నుంచి ఏప్రిల్ 2023 వరకు ఓఅండ్‌ఎం పంప్‌హౌజ్‌కు 6000 కోట్లు మంజూరయ్యాయని, పని పురోగతిలో ఉందన్నారు.

2014 నుంచి 2021/22 వరకు ఫేజ్ 1, 2, 3 క్రింద భీంఘన్‌పూర్ పంప్‌హౌజ్ నుండి 86, 106 బిఎంసిల నీరు ఎత్తి పోయుటకు జరిగిందని, జెసిఆర్‌డిఎల్‌ఐఎస్ ప్రాజెక్టు ఫేజ్2 క్రింద 1700 ఎకరాల ఆయకట్టు కలిగిన మహాముత్తారం మండలం నర్సింగపూర్ చెరువుకు నీరందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూపాలపల్లి నియోజకవర్గంలోని టన్నెలకు బదులుగా 3మీటర్ల పైప్‌లైన్ వేయడానికి 2017లో రూ. 1164.92కోట్లు మంజూరు చేయబడ్డాయని, అట్టి పనులు 2020 సంవత్సరంలో పూర్తి అయ్యాయని, మొత్తం ఖర్చు రూ.1325 కోట్లు, ఇప్పుడు ఒప్పంద నిబంధనల ప్రకారం ప్రస్తుత ఏజెన్సీలో ఓయం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి వలన గ్రామాలలో ఉన్న ప్రతి చెరువు జూన్ మాసంలో కూడ జలకళలాడుతున్నాయని, చెరువుల నీటి నిల్వ వలన తెలంగాణ రాష్ట్రం మత్సశాఖ గణనీయమని అభివృద్ధి చెందిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ముదిరాజ్ సోదరులకు మత్సశాక ఆదాయంతో ఎంతో ప్రగతిని సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News