Monday, December 23, 2024

ఖమ్మంలో విషాదం.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 AR Constable Suicide in Khammam

ఖమ్మం: పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి నియోజకవర్గంలోని యజ్ఞనారాయణపురం గ్రామానికి చెందిన అశోక్ కుమార్ 2020లో ఏఆర్ కానిస్టేబుల్ గా నియమితుడయ్యాడు. తరువాత కొత్తగూడెం పోలీస్ స్పెషల్ పార్టీలోలో పని చేశాడు. ఆ తర్వాత పోలీస్ శాఖలో బదిలీ ప్రక్రియలో భాగంగా ములుగు జిల్లాకు బదిలీ అయ్యాడు. ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు.అయితే, రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది డోర్ కొట్టడంతో ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేయగా.. ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా, ఈరోజు సొంత గ్రామంలో అశోక్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమం జరగాల్సి ఉంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 AR Constable Suicide in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News