Wednesday, January 22, 2025

తుపాకి శుభ్రపరుస్తూ ప్రమాదానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తుపాకి శుభ్రపరుస్తూ ఏ ఆర్ కానిస్టేబుల్ ప్రమాదానికి గురైన ఘటన మంగళవారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట చిన్నకోడూరు మండలం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లు పుల్లూరు గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సుతారి రాజశేఖర్ 2013 బ్యాచ్, విధినిర్వహణలో భాగంగా గత కొద్ది రోజుల క్రితం నంగునూరు మండలం రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మాబులేషన్ నిర్వహించగా, ఆ వెపన్స్ ను శుభ్రపరుస్తున్న క్రమంలో ఏకే47 గన్ లో ఉండే చిప్ కదలడంతో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి కుడి చెయ్యి, కుడి కన్నుకు గాయాలైనట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన వెంటనే అక్కడే ఉన్న తోటి సిబ్బంది సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారన్నారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు హైదరాబాదులోని సరోజిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News