Monday, December 23, 2024

రెహమాన్ చెన్నై షో రసాభాస.. డబ్బులు వాపసీ

- Advertisement -
- Advertisement -

చెన్నై : స్థానికంగా ఆదివారం సాయంత్రం ఆదిత్యారాం ప్యాలెస్‌లో జరిగిన ఏ ఆర్ రెహమాన్ సంగీత కచేరీ రసాభాసకు దారితీసింది. ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఏఆర్ రెహమాన్ చాలాకాలం తరువాత మరక్కుమ నెంజామ్ ( ఈ మనసు మర్చిపోతుందా) పేరిట చెన్పై పట్ల తన ప్రేమాభిమానాలతో సంగీత సభకు దిగారు. ఆస్కార్ విజేత అయిన రెహమాన్ ఇక్కడి ఈస్ట్‌కోస్టు రోడ్డు (ఇసిఆర్) లో తలపెట్టిన సంగీత కచేరీకి దాదాపు 50 వేల మందికి టిక్కెట్లను విక్రయించారు. ఇది వేదిక పరిమితికి మించినది అయింది.

దీనితో తరలివచ్చిన అభిమానులు నానా ఇక్కట్లకు గురయ్యారు. పిల్లలు పెద్దలు , యువత అంతా తొక్కిసలాటకు గురి కావడం, కొందరు గాయడటంలో జనం ఇప్పుడు నిర్వాహకులను తిట్టిపోశారు. ఇటువంటి వారితో గొప్ప సంగీత దర్శకుడు కచేరీ ఏర్పాట్లకు దిగడం దారుణం అని , జరిగిన దానికి సిగ్గుపడండి సారూ అని ఓ యువతి నిరసనకు దిగింది. కేవలం 15 వేల మందికి పరిమితం అయిన వేదికలో షో ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్టుగా టికెట్లు అమ్మకాలకు పెట్టడం బ్లాక్‌లో కూడా విక్రయాలు జరగడం ఇదంతా ఓ మ్యూజిక్ స్కామ్ అయిందని, దీని గురించి మీకు తెలుసునా? తెలిస్తే ఏ విధంగా స్పందిస్తారని నెటిజన్లు ప్రశ్నించారు.

జరిగిన విషయంపై ఏఆర్ రెహమాన్ సోమవారం స్పందించారు. ఈ విధంగా జరిగిందని తెలిసి చింతిస్తున్నట్లు తెలిపిన ఆయన , కొందరి అతిచేష్టలతో ఈ విధంగా జరిగిందని చెపుతూ ప్రియమైన చెన్నై బ్రదర్స్ సిస్టర్స్ టికెట్లు కొని తొక్కిసలాటకు గురై ఉంటే క్షమించండి, ఇక టికెటు తీసుకుని కచేరీకి రాలేకపోయిన వారికి టికెట్ ముక్కను పంపించినా వాటిధర తిరిగి చెల్లిస్తానని ఆన్‌లైన్‌లో ప్రకటన వెలువరించారు. సభ ఏర్పాటు అయిన ప్రాంతం పరిధి పర్యవేక్షణలోకి వచ్చే తంబారం సిటి పోలీసు కమిషనర్ ఎ అమల్‌రాజు స్పందిస్తూ పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందని, అదుపులోకి తెచ్చామని, అయితే జరిగిన దానికి సంబంధించి నిర్వాహకులను విచారిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News