Monday, December 23, 2024

సంగీత దర్శకురాలిగా ఎఆర్ రెహ్మాన్ కుమార్తె

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ పెద్ద కుమార్తె, ప్రముఖ సినీ గాయని ఖతీజా రెహ్మాన్ సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

ప్రముఖ తమిళ దర్శకురాలు హలితా షమీమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మిన్మినికి ఖతీజా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. హలిత గతంలో సిల్లు కరుపట్టి, ఏలే వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ విషయాన్ని హలిత అధికారికంగా ప్రకటిస్తూ ఖతీజా గొప్ప గాయని మాత్రమే కాదు అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్ కూడా నంటూ తెలిపారు. ఒక గొప్ప సంగీతం రూపొందుతోందంటూ ఆమె పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరికీ పరిచయమైనట్లు తెలుస్తోంది. సిల్లు కరప్పట్టి చిత్రాన్ని చూసిన తర్వాత ఖతీజా హలితకు అభిమానిగా మారిపోయారు. హలితతో మాట్లాడిన ఖతీజా ఆ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. తన తదుపరి చిత్రానికి సంగీత దర్శకత్వం వహించమని హలిత కోరగా ఖతీజా నిరాకరించారు. అయితే ఏడాది తర్వాత మనసు మార్చుకున్న ఖతీజా హలిత చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి అంగీకరించారు.

ఖతీజా ఇటీవల కోక్ స్టూడియో తమిళ్ కోసం గీత రచయిత, ర్యాపర్ అరివుతో కలసి ఒక పాట పాడారు. సగవాసి అనే ఆ పాట ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్ దాటింది. తన తండ్రి ఎఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో మామన్నన్ చిత్రం కోసం పాడిన జిగు జిగు రైల్ అనే పాట కూడా బాగా పాపులర్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News