Monday, March 17, 2025

సంగీత దర్శకుడు రెహమాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్(58) ఆదివారం డీహైడ్రేషన్ కారణంగా ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనను చికిత్స అనంతరం కొన్ని గంటల తరువాత డిశ్చార్జ్ చేశారు. ‘ఇప్పుడాయన ఇంటికొచ్చారు’ అని ఆయన మేనేజర్ సెంథిల్ వేలన్ తెలిపారు. రెహమాన్ సోదరి రిహానా ‘ఆయనకు ఏమి కాలేదు. ఆయన డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్యలతో అనారోగ్యంగా ఉన్నారు, అంతే.’ అని పిటిఐ వీడియోకు తెలిపింది. కాగా ఆయనకు మెడ నొప్పి కూడా ఉందని మేనేజర్ తెలిపాడు.

రెహమాన్‌కు దూరంగా ఉంటున్న ఆయన భార్య సైరా కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పైగా ఆమె తనను రెహమాన్ మాజీ భార్య అని పేర్కొనొద్దని, తాము విడాకులు ఇంకా తీసుకోలేదని, విడిపోలేదని ఓ ఆడియో స్టేట్‌మెంట్‌లో తెలిపారు. ఇదిలావుండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ తాను హాస్పిటల్ డాక్లర్లతో మాట్లాడానని, రెహమాన్ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నానని అన్నారు. రెహమాన్ బాగానే ఉన్నారని, త్వరగా కోలుకుని ఇంటికి వస్తారని ఓ సోషల్ మీడియా పోస్ట్‌ను కూడా స్టాలిన్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News