చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విజేత ఎఆర్ రహమాన్ అస్వస్థతకు గురయ్యారు. లండన్‌కి వెళ్లి తిరిగి వచ్చిన ఆయన ఛాతీలో నొప్పితో చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రహమాన్ ఇటీవల ‘ఛావా’ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌సి 16’ సినిమాకు పని చేస్తున్నారు. అయితే లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆయన కాస్త ఇబ్బందిగా ఉండటంతో శనివారం రాత్రి డాక్టర్ దగ్గరకు వెళ్లారు. డాక్టర్లు.. రహమాన్‌కు డిహైడ్రేషన్‌గా ఉందని.. రంజాన్ ఉపవాసం వల్ల అది ఇంకా తీవ్రమైందని చెప్పారు. మళ్లీ ఆదివారం కూడా ఆయన అనారోగ్యంగా ఉంది అని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు .అక్కడ ఇసిజితో పాటు ఇతర పరీక్షలు కూడా వైద్యులు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
ఎఆర్ రహమాన్‌కు అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -