Thursday, December 26, 2024

ఏఆర్. రెహమాన్ బంగారం: సైరాభాను

- Advertisement -
- Advertisement -

ముంబై: సంగీత  దర్శకుడు రెహమాన్ సంగీత బృందంలో ఉన్న మోహిని డే అనే అమ్మాయికి ఉన్న సంబంధం కారణంగానే భార్యకు విడాకులు అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రెహమాన్ భార్య సైరా భాను తన భర్తకు సపోర్టుగా నిలిచింది. తన అనారోగ్యం కారణంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తన న్యాయవాది వందనా షాకు ఓ వాయిస్ క్లిప్ పంపింది.

‘‘నేను సైరా భానును మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేను ముంబయిలో ఉన్నాను. గత కొన్ని నెలలుగా శారీరకంగా నా పరిస్థితేమి బాగాలేదు. అందుకే రెహమాన్ నుంచి విడాకులు కోరుకుంటున్నాను. ఇదే మా విడాకులకు కారణం. యూట్యూబ్ కు, యావత్ యూట్యూబర్లకు, తమిళ మీడియాకు నేను చేసే వి జ్ఞప్తి ఒక్కటే… దయచేసి రెహమాన్ గురించి చెడుగా ప్రచారం చేయొద్దు. నా ఆరోగ్యం వల్లే చైన్నై నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు…కానీ మీరే నా  కోసం వెతుకుతున్నారు. నేను చికిత్స తీసుకునేందుకు ముంబై వచ్చాను. నా పిల్లలు కానీ, రెహమాన్ ను కానీ ఎవరినీ నేను డిస్ట్రబ్ చేయదలచుకోలేదు. కానీ రెహమాన్ ఓ అద్భుతమైన వ్యక్తి. అతడ్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. అతడు కూడా నన్ను అలాగే ప్రేమించాడు. దయచేసి అతడిపై తప్పడు ఆరోపణలు చేయకండి. అతడిని బజారుకీడ్చవద్దు. త్వరలో చికిత్స పూర్తి చేసుకుని తిరిగి చెన్నై వస్తాను’’ అంటూ సైరా భాను తన వాయిస్ నోట్స్ లో వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News