Wednesday, January 22, 2025

తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఎపిలో దారుణం జరిగింది. ఓ ఎఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎపిలోని అన్నమయ్య జిల్లా రాయచోటీలోని ఎస్‌పి కార్యాలయంలో ఎఆర్ మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వేదవతి (22) ఎస్‌పి కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్‌లో తన వద్దనున్న సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసు అధికారులు సందర్శించారు. కుటుంబసభ్యులకు సమాచారమందించి, పోస్టుమార్టం నిమిత్తం వేదవతి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News