Monday, December 23, 2024

ప్రేమ వివాహం…. సోదరిని ఎత్తుకెళ్లిన సోదరుడు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

పాట్నా: కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా సోదరి కులాంతర ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో ఆమెను భర్త ఇంటి నుంచి సోదరుడు ఎత్తుకెళ్లిన సంఘటన బిహార్ రాష్ట్రం అరారియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రూప అనే యువతి ఛోటు కుమార్‌ను గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఛోటును పెళ్లి చేసుకుంటానని రూప తన ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు.

Also Read: విద్యుత్ షాక్‌తోనే 40 మంది మృతి..

కుటుంబ సభ్యులు తమ ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆమె జూన్2న తన ప్రియుడితో పారిపోయి కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. ఆగ్రహంతో రగిలిపోయిన యువతి కుటుంబ సభ్యులు వివాహం జరిగిన రెండు యువతి అత్తారింటికి చేరుకొని బైక్‌పై యువతిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. యువతి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రూపను విచారించిన తరువాత ఆమె కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News