- Advertisement -
ఢిల్లీ: శాసనసభలో నేడు తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఆప్ ఎమ్మెల్యేలు నిజాయతీపరులని, పార్టీకి విధేయులుగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. మణిపూర్, బిహార్, అస్సాం, మహారాష్ట్రాల్లో ప్రభుత్వాలను బిజెపోళ్లు కూల్చేశారన్నారు. కొన్ని చోట్ల అయితే ఒక్కో ఎమ్మెల్యేను రూ.50 కోట్లు చొప్పున కొనేశారని, ఢిల్లీలోనూ అలాంటి ప్రయత్నాలు జరిగాయన్నారు. రూ. 20కోట్లు ఇస్తామంటూ 12 మంది ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశారన్నారు. కానీ బిజెపి ఆపరేషన్ కమల్ విఫలమైందని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఈ విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోందని, అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.
- Advertisement -