Friday, December 20, 2024

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట మోసం : అర్వింద్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగితే.. తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. గృహనిర్మాణ శాఖలో 1.821 మందికి 500 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారన్నారు. ఇంత తక్కువ స్థాయిలో సిబ్బంది ఉంటే ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించేది ఎవరు? నిర్మాణాలు ఎలా పూర్తవుతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇళ్ల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు చూపించారు.. కానీ. రూ.18.500 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయలేదని ఎంపి అర్వింద్ ఆరోపించారు.

మా పోరాటాన్ని ఉదృతం చేస్తాం : నల్లు ఇంద్రసేనారెడ్డి

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్తున్నట్లు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. అనుమతి తీసుకున్నాక కూడా బాటసింగారానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. బిజెపి నాయకులను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ సమాజం చూస్తోంది. బిఆర్‌ఎస్ మోసాలను ఇక ప్రజలు నమ్మరు. అరెస్టులు, అడ్డంకులతో బిజెపి ఎదుగుదలను ఆపలేరు. మా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం‘ అని ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News