Monday, December 23, 2024

పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీలో క్వార్టర్స్​ కు దీపికా కుమారి

- Advertisement -
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్ లో శనివారం భారత్ కు మిశ్ర‌మ ఫ‌లితాలు ద‌క్కాయి. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌లో మను భాకర్ త్రుటిలో ప‌త‌కం చేజార్చుకుంది. నాల్గో స్థానంతో స‌రిపెట్టుకోవ‌డంతో ప‌త‌కం మిస్ అయ్యింది. అయితే, అర్చ‌రీలో దీపికా కుమారి స‌త్తా చాటింది. ఆర్చరీ సింగిల్స్ లో క్వార్టర్స్ కు దూసుకెళ్లింది.

16వ రౌండ్లో భాగంగా జ‌ర్మ‌నీ ప్లేయ‌ర్ మిచెల్లె క్రోపెన్ పై 6-4 తేడాతో దీపిక నెగ్గింది. దీంతో ఇవాళ సాయంత్రం 5.09 గంట‌ల‌కు (భార‌త కాల‌మానం ప్ర‌కారం) క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. క్వార్టర్స్ లో ఆమె సుహ్యెన్ నామ్ లేదా మదలీనా అమైస్ట్రోయిలో ఒక‌రితో పోటీ ప‌డ‌నుందిు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు పారిస్ ఒలింపిక్స్ లో భార‌త్ ఖాతాలో మూడు కాంస్య ప‌త‌కాలు చేరాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News