Monday, December 23, 2024

జాతీయ స్థాయిలో ఆర్చరీ పోటీలకు ప్రత్యేక స్థానం..

- Advertisement -
- Advertisement -

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికలో క్రీడలలో ఆర్చరీ క్రీడకు ప్రత్యేక స్థానం, చాలా విశిష్టమైన క్రీడ అని ఎసిపి సారంగపాణి అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఆయన ముఖ్యాతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ క్రీడాలోకంలో ఆర్చరీకి చాలా ప్రాధాన్యత ఉండడమే కాకుండా చాలా మంది ఆర్చరీకి ప్రత్యేక ఆసక్తి కనబరుస్తాన్నారని, దేశ విదేశాల్లో ఈ క్రీడకు చాలా మంతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు.

అల్ఫోర్స్ విద్యా సంస్థల నిర్వహుకులు మల్లారెడ్డి మాట్లాడుతూ.. విలువిద్య చాలా పురాతనమైదని, సాంప్రదాయబద్దమైన క్రీడ అని అన్నారు.ఏకలవ్యుడుఎవరి సాయం లేకుండా రాణించారన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, శంకరయ్య, రాజవీరు, శ్రీనివాస్, వివిధ జిల్లా కోచులు, ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News