Tuesday, April 8, 2025

ఆర్చరీ ప్రపంచకప్ 2023: భారత్‌కు నాలుగు పతకాలు..

- Advertisement -
- Advertisement -

అంటాల్య: టర్నీలోని జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ 2023లో భారత్ నాలుగు పతకాలను సొంతం చేసుకుంది. పురుషుల రికర్వ్ టీమ్ అతనుదాస్, ధీరజ్ బొమ్మదేవర, తరుణుదీప్‌రాయ్ ఆదివారం తమ ప్రస్థానాన్ని రజత పతకంతో పూర్తి చేశారు. భారత్ త్రయం చైనా చేతిలో 45తో ఓటమిపాలై స్వర్ణాన్ని చేజార్చుకుంది. పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్‌లో ధీరజ్ బొమ్మదేవర కాంస్యాన్ని గెలుచుకున్నాడు.

దీంతో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలతో సహా నాలుగు పతకాలు చేరాయి. కాగా జ్యోతి సురేఖ వెన్నం వ్యక్తిగత స్వర్ణం, మిక్స్‌డ్ టీమ్‌లో జ్యోతి, ప్రవీణ్ డియోటాలే జోడీ స్వర్ణం, పురుషుల రికర్వ్ టీమ్‌లో అతనుదాస్, ధీరజ్ బొమ్మదేవర, త్రయం రజతం కైవసం చేసుకోగా ధీరజ్ పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్‌లో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News