Wednesday, January 22, 2025

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1: సత్తాచాటిన భారత ఆర్చర్లు

- Advertisement -
- Advertisement -

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత ఆర్చర్లు సత్తాచాటారు. షాంఘైలో మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లలో భారత ఆర్చర్లకు స్వర్ణాలు లభించాయి. మూడు బంగారు పతకాలతో ఆర్చర్లు హాట్రిక్ నమోదు చేశారు. తెలుగుతేజం జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్  కౌర్ బృందానికి బంగారు పతకం వరించింది. మహిళ జట్టు 236-225 పాయింట్ల తేడాతో పసిడి కైవసం చేసుకుంది. మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో కూడా జ్యోతి సురేఖ మెరిసింది. పురుషుల టీమ్ ఈవెంట్ లో భారత బృందానికి బంగారు పతకం దక్కింది. అభిషేక్ వర్మ, ప్రియాన్స్, ప్రీతమేష్ బృందానికి స్వర్ణ పతకం వరించింది. ఈ టోర్నీలో జ్యోతి సురేఖ రెండు బంగారు పతకాలు కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News