Friday, January 10, 2025

చలిగా ఉందని మద్యం, సిగరెట్లు తాగుతున్నారా?

- Advertisement -
- Advertisement -

మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఇక శీతాకాలం వస్తే చాలు వీటి వినియోగం మరింత ఎక్కువైపోతుంది. దీనికి ప్రధాన కారణ.. మద్యం, సిగరెట్లు తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందని. ఈ క్రమంలోనే ప్రజలందరూ పెద్ద మొత్తంలో మద్యం, సిగరెట్లు తీసుకోవడం ప్రారంభిస్తారు. అయితే ఇది మనిషిని మానసిక రోగిని చేస్తోంది. ఈ రెండిటిని అధికంగా తీసుకుంటే నెమ్మదిగా అనారోగ్యం పాలవుతారు. ఇకపోతే శీతాకాలంలో మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం వల్ల కలిగే కొన్ని సమస్యల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఆల్కహాల్ వల్ల కలిగే సమస్యలు

1. శీతకాలంలో శరీర వెచ్చదనానికి అధిక మొత్తంలో మద్యం సేవిస్తే మతిమరుపు, ఆలోచన, మానసిక స్థితిలో మార్పులు వంటి మెదడు సమస్యలు వస్తాయి. మద్యం అధికంగా సేవించడం వల్ల మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది.
2. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు కూడా వస్తాయి. ప్రతిరోజు మద్యం సేవిస్తే హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇదే సమయంలో బీపీ కూడా పెరుగుతుంది. ప్రధానంగా మద్యం ఎక్కువగా తాగితే గుండె బలహీనపడుతుంది.
3. అధికంగా ఆల్కహాల్ తీసుకుంటే అది కాలేయ మీద ప్రభావం చూపుతుంది. ఇందులో భాగంగా కాలేయ సమస్యలు (కిడ్నీ ఫెయిల్యూర్) కాలేయం దెబ్బతినడం, కాలేయ వ్యాధి, క్యాన్సర్ వంటివి వస్తాయి. మొత్తం మీద కాలేయం ఎప్పుడైనా దెబ్బతినవచ్చు.

సిగరెట్ తాగడం వల్ల కలిగే సమస్యలు

1. ప్రతిరోజు సిగరెట్ తాగితే ఊపిరితిత్తుల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సిగరెట్ పోగా మీకు మాత్రమే కాదు మీ చుట్టుపక్కల ఉన్నవారికి కూడా ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది.
2. సిగరెట్లు అధికంగా తాగితే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, అనేక సమస్యలు వస్తాయి. అయితే సిగరెట్ తాగేవారికి ఎక్కువగా గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
3. సిగరెట్ తాగడం చర్మ సమస్యలు కూడా దారితీస్తుంది. అధికంగా సిగరెట్లు తాగితే చర్మ క్యాన్సర్, చర్మవ్యాధి, ముడతలు వంటి సమస్యలు వస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News