Monday, December 23, 2024

టికెట్లు అమ్ముకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రమాణానికి సిద్ధమా?

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డికి రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి సవాల్

మన తెలంగాణ / హైదరాబాద్: హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర రేవంత్ రెడ్డి హైడ్రామాపై తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ గురించి కాదు.. మొదట రేవంత్ రెడ్డి అమ్ముకున్న టికెట్ల గురించి చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్కో టికెట్ కు 10 కోట్లు అడిగారని 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని నాగం జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా బహిరంగంగా మాట్లాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఏకంగా గాంధీభవన్ కే తాళం వేసే పరిస్థితి వచ్చింది అంటే రేవంత్ రెడ్డి దోపిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తారని ఆయన ఆరోపించారు. టికెట్లకు డబ్బులు తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రావాలని రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. తాము పైసా కూడా తీసుకోకుండా టికెట్లు ఇచ్చామని ప్రమాణం చేస్తామని. రేవంత్ రెడ్డి కూడా ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాము డబ్బులు తీసుకోలేదు అనడానికి నిదర్శనమే పేద బిడ్డ అయిన బడే నాగజ్యోతికి ములుగు టికెట్ ఇవ్వడం అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బిఎర్‌ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News