Tuesday, September 17, 2024

పిఎసి చైర్మన్‌గా అరికెపూడి గాంధీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం లో మూడు కమిటీలు ఏర్పాటు చేస్తూ శా సనసభ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పిఎసి) చైర్మన్‌గా ఎం ఎల్‌ఎ అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ క మిటీ(అంచనాల కమిటీ) చైర్మన్‌గా ఎన్. పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ కమిటీ చై ర్మన్‌గా కె.శంకరయ్యను నియమిస్తూ శా సనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యు లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు కమిటీలకు కలిపి ఒక్కో కమిటీలో 12 మంది చొప్పున సభ్యులను నియమించారు. పిఎసి
సభ్యులుగా ఎంఎల్‌ఎలు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రామ్‌రావు పవార్, అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు, ఎంఎల్‌సిలు టి.జీవన్‌రెడ్డి,

టి.భానుప్రసాద్‌రావు, ఎల్.రమణ, సత్యవతి రాథోడ్ నియామకం కాగా, అంచనాల కమిటీ సభ్యులుగా ఎంఎల్‌ఎలు సునీతా లకా్ష్మరెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, సిహెచ్ విజయరామారావు, కోరం కనకయ్య, రాందాస్ మాలోతు, యశస్విని మామిడాల, పి.రాకేష్‌రెడ్డి, ఎంఎల్‌సిలు ఎంఎస్ ప్రభాకర్‌రావు, సుంకరి రాజు, టి.రవీందర్‌రావు, వి.యాదవరెడ్డి నియమితులయ్యారు. అలాగే పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ సభ్యులుగా ఎంఎల్‌ఎలు సబితా ఇంద్రారెడ్డి, కె.పి.వివేకానంద, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, రాజాసింగ్, పటోళ్ల సంజీవరెడ్డి, లక్ష్మికాంతరావు, కౌసర్ మోహియుద్దిన్, ఎంఎల్‌సిలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, తాత మధుసూదర్, మిర్జా రియాజుల్ హసన్‌లు నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News