Thursday, December 26, 2024

కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నా: అరెకపూడి గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అగ్రనేత, ఎంఎల్‌ఎ హరీష్ రావు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారని ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల సవాళ్లు, ప్రతిసవాళ్లతో గురువారం హైటెన్షన్ నెలకొంది. అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో అరెకూడి మీడియాతో మాట్లాడారు. సీనియర్ ఎంఎల్‌ఎ విషయంలో ప్రాంతీయ విభేదాలు తీసుకవస్తున్నారని, బిఆర్‌ఎస్ నేత వ్యాఖ్యలు పార్టీ వైఖరా? వ్యక్తిగత వైఖరా? అని తెలిపాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఒక మోసకారి మాటలు ఎంతకాలం పడాలని, ఎంతకాలం నిందలు మీద వేసుకోవాలని, అందుకే తాను స్పందించానన్నారు.

మోసకారి మాటల పట్ల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇది బిఆర్‌ఎస్-అరెకపూడి గాంధీకి యుద్ధం కాదు అని, తాను బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డితో వ్యక్తిగతంగా యుద్ధం చేస్తున్నానని అరెకపూడి గాంధీ చెప్పారు. పాడి కౌశిక్‌రెడ్డితో యుద్ధం అనుకొని వెళ్లానని, పార్టీని కౌశిక్‌రెడ్డి భ్రష్టుపట్టిస్తున్న విషయాన్ని గుర్తించాలని, పార్టీలో కౌశిక్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలు, చీలికలు తీసుకొస్తున్నారని, ఇలాంటి వారితో ప్రమాదం ఉందని కెసిఆర్ గుర్తించాలన్నారు. బిఆర్‌ఎస్ నుంచి మరింత మంది ఎంఎల్‌ఎలు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని, సమవుజ్జీ కానీ కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నానని, తనకు బిఆర్‌ఎస్ పార్టీ, కెసిఆర్ అంటే గౌరవం ఉందని గాంధీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News