Monday, January 20, 2025

కాంగ్రెస్‌లో చేరిన మరో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ దెబ్బ దెబ్బ తగులుతోంది. బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అరికెపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచుకున్నారు. అరికెపూడి గాంధీకి రేవంత్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంఎల్‌ఎ సంఖ్య తొమ్మిదికి చేరింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ రెడ్డి, నార్నె శ్రీనివాస్‌లు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News