Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరిన ఆరెకటిక సంఘం నాయకులు

- Advertisement -
- Advertisement -

తలకొండపల్లి: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో ఆరెకటిక సంఘం నాయకుల బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే కండువాలు వేసి ఆహ్వానించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ప్రగతి సాధ్యమనే విషయాన్ని ప్రజలు గుర్తించారని, రాబోయే ఎన్నికల్లో మరోమారు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. అనంతరం కళ్యాణ్‌కార్ జహంగీర్‌జీ ఆధ్వర్యంలో పలువురు ఆ సంఘం నాయకులు నియోజకవర్గ అభివృద్ధి జైపాల్‌యాదవ్‌తోనే సాధ్యమనే విషయాన్ని గుర్తించి ఆరెకటిక సంఘం నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరరన్నారు. రాబోయే ఎన్నికల్లో జైపాల్‌యాదవ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరెకటిక సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News