Thursday, January 23, 2025

బిజెపిలో చేరిన ఆరేపల్లి మోహన్, ఈశ్వరప్ప..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్‌లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. గురువారం కరీంనగర్ జిల్లా, మానకొండూరు ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వికారాబాద్ జిల్లా, పరిగి ప్రాంతానికి చెందిన వన్నె ఈశ్వరప్పతో పాటు ప్రజా ప్రతినిధులు ఎంపిలు డా.లక్ష్మణ్, బండి సంజయ్, ఆయన సమక్షంలో బిజెపిలో చేరారు.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వేగంగా రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు మారుతున్నాయి.. బిజెపివైపు తెలంగాణ సమాజం, యువత చూస్తుందన్నారు.

అధికారం దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో బిజెపికి అండగా నిలబడాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల చేతిలో చిప్ప మాత్రమే మిగులుతుంది. పేద ప్రజలకు మద్యం తాగిస్తూ.. ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులను రద్దు చేస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News