Friday, November 22, 2024

విశ్వవిజేత అర్జెంటీనా

- Advertisement -
- Advertisement -

షూటౌట్‌లో ఫ్రాన్స్‌పై 42 తేడాతో ఘనవిజయం
ఎంబాపె హ్యాట్రిక్ వృథా

ఖతార్: ఫిఫా ప్రపంచకప్ 2022లో అర్జెంటీనా విశ్వవిజేతగా అవతరించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో అర్జెంటీనా పైచేయి సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. నిర్ణీత సమయంలో, అదనపు సమయంలోనూ ఇరుజట్లు సమవుజ్జీలుగా నిలవడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్‌లో 42తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా మూడోసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. మెస్సీ చిరకాల వాంఛ తీరడంతో ప్రపంచవ్యాప్తంగా అర్జెంటీనా అభిమానుల సంబరాలు మిన్నంటాయి.

దోహా వేదికగా అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2022 ఫైనల్ సాకర్ అభిమానుల ఉత్కంఠ నడుమ రసవత్తరంగా జరిగింది. తొలి 36నిమిషాల్లోనే అర్జెంటీనా రెండు గోల్స్ సాధించి ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. మ్యాచ్ 27వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను లియోనల్ మెస్సీ మలచడంతో అర్జెంటీనా 10 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఫ్రెంచ్ గోల్ పోస్టు ము ందు అర్జెంటీనా ఆటగాడు డిమారియాను ఫ్రాన్స్ ఆటగాడు టాకిల్ చేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్‌ను కేటాయించాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బంతిని గోల్‌పోస్టులోకి పంపడంతో దోహా స్టేడియం అర్జెంటీనా అభిమానుల ఆనందోత్సహాలతో ఊగిపోయింది. అనంతరం డిమారియా 36వ నిమిషంలో కొట్టిన ఫీల్డ్‌గోల్‌తో అర్జెంటీనా ఖాతా లో మరో గోల్ నమోదైంది.అర్జెంటీనా ముగిసేసరికి ఆధిక్యం సాధించింది.

ఎంబాపె క్విక్ డబుల్ గోల్

ద్వితియార్ధంలో పుంజుకున్న డిఫెండిగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ విజృంభించి నిమిషాల వ్యవధిలోనే రెండు వరుస గోల్స్‌తో అర్జెంటీనాకు దీటుగా సమాధానమిచ్చింది. ఎంబాపె రెండు గోల్స్‌తో స్కోరును సమంచేసి ఫ్రాన్స్‌ను టైటిల్‌రేసులో నిలిపాడు. 80వ నిమిషంలో తొలి గోల్ సాధించిన ఎంబాపె అర్జెంటీనా ఆధిక్యాన్ని తగ్గించాడు. అనంతరం తరువాత నిమిషంలోనే మరోసారి బంతిని గోల్‌పోస్టులోకి పంపాడు. దీంతో ఇరుజట్లు చెరో రెండు గోల్స్‌తో సమంగా నిలిచాయి. మ్యాచ్ తుది అంకానికి చేరుకున్న ఇరుజట్లు మరో గోల్ నమోదు చేయలేకపోయాయి. మ్యాచ్ టై అవడంతో అదనపు సమయాన్ని కేటాయించారు. మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అదనపు సమయం సెకండాఫ్ 108వ నిమిషంలో మెస్సీ గోల్ చేయడంతో అర్జెంటీనా 32 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

ఎంబాపె 118వ నిమిషంలో హ్యాట్రిక్ గోల్ చేయడంతో స్కోరు 33తో మరోసారి మ్యాచ్ టై అయింది. అదనపు సమయంలో చెరో గోల్ చేయడంతో మ్యాచ్ మళ్లీ టై అయింది. ఈనేపథ్యంలో షూటౌట్‌కు తెరలేచింది. షూటౌట్‌లో అర్జెంటీనా 42తేడాతో గెలవడంతో విశ్వవిజేతగా అవతరించింది. కాగా 1998లో ఫుట్‌బాల్ దిగ్గజం బ్రెజిల్‌ను ఓడించి తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సాకర్ ప్రపంచకప్‌లో బోణీ కొటింది. 1998లో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు విశ్వవిజేతగా అవతరించిన రెండు దశాబ్దాల అనంతరం 2018లో క్రొయేషియాపై గెలుపొంది ఐరోపా దేశం రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2022లో డిఫెండింగ్ బరిలోకి దిగిన ఈసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు ఆరోసారి ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన 1986, 2022 ఎడిషన్లలో విజేతగా అవతరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News