Thursday, January 23, 2025

ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి క్రొయేషియా ఔట్.. టైటిల్ పోరుకు అర్జెంటీనా

- Advertisement -
- Advertisement -

దొహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో అర్జెంటీనా 30 గోల్స్ తేడాతో కిందటిసారి రన్నరప్ క్రొయేషియాను ఓడించింది. ఇక గ్రూప్ దశలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి చవిచూసిన అర్జెంటీనా ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. వరుస విజయాలతో టైటిల్ పోరుకు చేరుకుని అర్జెంటీనా ప్రపంచకప్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఇక ఈ మ్యాచ్‌లో క్రొయేషియా కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. మరోవైపు ఎప్పటిలాగే అర్జెంటీనా విజయంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ కీలక పాత్ర పోషించాడు. జులియన్ అల్వరేజ్ కూడా రెండు గోల్స్ చేసి తనవంతు సహకారం అందించాడు.

ఆరంభం నుంచే దూకుడు..
మరోవైపు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. వరుస దాడులతో క్రొయేషియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. అర్జెంటీనా చెలరేగి ఆడడంతో క్రొయేషియా తీవ్ర ఒత్తిడికి గురైంది. మెస్సీ, అల్వరెజ్ తదితరులు అసాధారణ ఆటతో అర్జెంటీనాకు అండగా నిలిచారు. అర్జెంటీనా ఆటగాళ్ల దూకుడు ముందు క్రొయేషియా ఎదురు నిలువలేక పోయింది. ప్రథమార్ధంలో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇక 34వ నిమిషంలో మెస్సీ కళ్లు చెదిరే గోల్‌ను నమోదు చేశాడు. ఆ వెంటనే జులియన్ అల్వరేజ్ మరో గోల్ సాధించాడు. దీంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి అర్జెంటీనా 2-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా, ద్వితీయార్ధంలో కూడా అర్జెంటీనా జోరు కొనసాగించింది. ఈసారి క్రొయేషియా కాస్త పుంజుకున్నా ఫలితం లేకుండా పోయింది. అర్జెంటీనా పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి ఆటగాళ్ల దాడులను సమర్థంగా తిప్పికొట్టింది.

ఇదిలావుంటే 69వ నిమిషంలో అర్జెంటీనాకు మూడో గోల్ దక్కింది. యువ సంచలనం అల్వరేజ్ చిరస్మరణీయ గోల్‌ను సాధించి జట్టు ఆధిక్యాన్ని 30కు పెంచాడు. ఆ తర్వాత అర్జెంటీనా మరింత దూకుడును ప్రదర్శించింది. అయితే ఆట ముగిసే సమయానికి మరో గోల్ నమోదు చేయడంలో విఫలమైంది. ఇక చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన మెస్సీ సేన ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఫ్రాన్స్‌మొరాకో జట్ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ విజేతతో అర్జెంటీనా తుది పోరులో తలపడుతోంది. ఆదివారం టైటిల్ సమరం జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News