Monday, December 23, 2024

బ్రెజిల్‌కు అర్జెంటీనా షాక్..

- Advertisement -
- Advertisement -

కరాకస్: ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఛాంపియన్ అర్జెంటీనా పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు మాజీ ఛాంపియన్ బ్రెజిల్ ఈ సారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. 2016, 2020 లో వరుసగా ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు సాధించిన బ్రెజిల్ ఈసారి విశ్వ క్రీడలకు అర్హత సాధించడంలో విఫలమైంది. వెనిజులా వేదికగా జరిగిన దక్షిణ అమెరికా ఒలింపిక్స్ అర్హత పోటీల్లో అర్జెంటీనా చేతిలో ఓటమి పాలుకావడంతో బ్రెజిల్ ఆశలకు గండిపడింది.

ఒలింపిక్స్ అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బ్రెజిల్ పరాజయం చవిచూసింది. అర్జెంటీనా 10 తేడాతో బ్రెజిల్‌ను ఓడించి ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకుంది. దక్షిణ అమెరికా క్వాలిఫయర్ టోర్నీలో అర్జెంటీనా ఐదు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింద. మరోవైపు పరాగ్వే ఏడు పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి ఒలింపిక్‌కు అర్హత సాధించింది. వెనిజులా, బ్రెజిల్ మాత్రం పారిస్ ఒలింపిక్స్‌కు దూరమయ్యాయి. కాగా, ఈ ఏడాది ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒలింపిక్స్ జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News