Saturday, December 21, 2024

మంత్రి కోమటిరెడ్డి, జడ్పీ చైర్మన్ మధ్య వాగ్వాదం

- Advertisement -
- Advertisement -

బీబినగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబినగర్ మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమావేశంలో ముందుగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడం కాకుండా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లడం సరికాదని సందీప్‌ రెడ్డి తెలిపారు.

రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలనడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఇలా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యలో జోక్యం చేసుకొని మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ఒక గొప్ప మహా నాయకుడు.. ఆయన కడుపులో పుట్టిన ఎలిమినేటి సందీప్ రెడ్డి ఒక బచ్చా అన్నారు. తన తండ్రి మీద ఉన్న ప్రేమతో ఈరోజు జడ్పీ చైర్మన్ పదవిపై కూర్చున్నాడే తప్ప కనీసం వార్డ్ మెంబర్ గెలిచే స్థాయిలో కూడా ఆయన లేడని వ్యక్తిగత దూషణలకు దిగాడు.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇంతలోనే కార్యకర్తలు జడ్పీ చైర్మన్ తీరుపై మండిపడ్డారు. అందరికీ రైతు బంధు వచ్చిందంటు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని సమాధానం చెప్పుకుంటుంటే జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి వినిపించుకోలేని పరిస్థితిలో ఉన్న తీరును గమనించిన పోలీసులు వెంటనే స్టేజీపైకి వచ్చి సందీప్‌ రెడ్డిని అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News